దిశ ఘటన సరే… ఈ ఉన్నావో గ్యాంగ్ రేప్ గురించి కూడా తెలుసుకోండి

unnao gang rape case details

దిశ కేసు లో చేసిన ఎన్కౌంటర్ ఫై చాలామంది హర్షం వ్యక్తం చేసారు. కానీ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓకే సంఘటన యావత్ భారతదేశాన్ని కలిచివేసింది .ఆ ఉన్నాయో ఘటన గురించి డీటెయిల్స్….#UnnaoCase

 

ఈ ఏడాది మార్చిలో ఉన్నావో జిల్లాలోని తన తల్లిదండ్రుల గ్రామానికి వెళ్లి వస్తున్న క్రమంలో బాధిత మహిళపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

 

వీరిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతావారు పరారీలో ఉన్నారు. నిందితుడు ఇటీవలే బెయిల్‌పై విడుదలై వచ్చాడు.

ఈ నేపథ్యంలో కేసు విచారణ నిమిత్తం బాధితురాలు గురువారం కోర్టుకు వెళ్తుండగా నిందితులు అపహరించారు. గ్రామ సమీపంలోని రైల్వే స్టేషన్‌‌కు వెళ్తున్న మెను అపహరించిన నిందితులు ఊరి చివరకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు.

 

 

బాధిత మహిళ శరీరం 90 శాతం మేర కాలిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను చికిత్స కోసం స్థానిక ప్రభుతవ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం లక్నో తరలించారు.

ఉన్నావో సామూహిక అత్యాచారం కేసులో నిందితురాలు 90 శాతం కాలిన గాయాలతో 43 గంటలపాటు మృత్యువుతో పోరాడి గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

What Happened in Unnao Case

అసలేం జరిగింది : –

 • మార్చిలో ఇద్దరు వ్యక్తులపై ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 • తనపై గన్ గురిపెట్టి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. అదంతా సెల్‌ఫోన్‌లో వీడియో తీసారంటూ ఫిర్యాదులో పేర్కొంది.

 

 • యువతి ఫిర్యాదు మేరకు రాయ్‌బరేలీ లాల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.
 • నిందితుల్లో ఒకరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా.. మరో నిందితుడిని మాత్రం ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు(పరారీలో ఉన్నాడు)
 • ఇదే క్రమంలో డిసెంబర్ 05వ తేదీ గురువారం ఆమె కోర్టు విచారణ కోసం రాయబరేలీ వెళ్లేందుకు బైస్వారా బీహార్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్తోంది.

 

 • ఐదుగురు యువకులు హరిశంకర్ త్రివేది, కిశోర్ శుభమ్, శివమ్, ఉమేష్‌లు దారిలో అటకాయించి దాడి చేశారు.
 • నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.

 

 • కిరోసిన్ పోసి నిప్పంటించినా తనను తాను కాపాడుకునేందుకు తీవ్రంగా పోరాడింది బాధితురాలు.
  మంటల్లో కాలిపోతూనే దాదాపు కిలోమీటర్ దూరం పరుగెత్తింది.

 

 • శక్తిని, ధైర్యాన్ని కూడగట్టుకొని తానే స్వయంగా అంబులెన్స్‌ కోసం 112కి డయల్ చేసింది.
  బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

 

 • కాలిన గాయాలతోనే ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.
  ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

#Unnao

నిందితుల చర్యను ప్రజలు , ప్రజాసంఘాల నేతలు, నెటిజన్లు తప్పుపడుతున్నారు. నిందితులను జైలులో పెట్టకుండా బహిరంగంగా తిరిగే స్వేచ్చ ఇస్తే.. పరిస్థితి ఇలానే ఉంటుందని మండిపడుతున్నారు. వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే  ఉన్నావో బాధితురాలి కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురయింది. దీనిపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

 

 

హైదరాబాద్ దిశ నిందితులకు చేసిన ఎన్‌కౌంటర్ లాగా ఉత్తరప్రదేశ్ పోలీసులు ఉన్నావో నిందితులను కూడా ఎన్‌కౌంటర్ చేయాలని నెటిజన్లు డిమాండు చేశారు. ఉన్నావో కేసులో బాధితురాలు మరణించిన నేపథ్యంలో యూపీ పోలీసులు నిందితులను శిక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారని నెటిజన్లు యూపీ పోలీసులను ప్రశ్నించారు.

 

కాగా ఉన్నావో బాధితురాలి మృతి అనంతరం యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉన్నావో బాధితురాలి వైద్యానికి అయిన ఖర్చులను ప్రభుత్వం చెల్లించాలని సీఎం అధికారులను కోరారు.

Comments

Facebook Comments