గ్రూప్‌ 2 ప్రొవిజనల్‌ లిస్ట్‌పై స్టే విధించిన హైకోర్టు

Telangana high court stay on tspsc Group 2 result

గ్రూప్‌ 2 ప్రొవిజనల్‌ లిస్ట్‌పై స్టే విధించిన హైకోర్టు

గ్రూప్‌-2 ఫైనల్‌ ప్రొవిజనల్‌ లిస్ట్‌పై హైకోర్టు స్టే విధించింది.తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టారాదని టీఎస్‌పీఎస్సీనీ హైకోర్టు ఆదేశించింది.

 


 

దీంతో గ్రూప్‌ 2 పరీక్షల్లో అందుకు సంబంధించిన జవాబులు తీసివేసి మిగిలిన వారికి ఇంటర్య్వూలలో 1:2 ప్రకారం నియామకాలు జరపాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ వెల్లడించింది.

 

 

గతంలో గ్రూప్‌-2 కేసులో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును TSPSC ధిక్కరించిందని గ్రూప్‌-2 అభ్యర్థులు పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు లెక్కచేయకుండా మళ్లీ అదే అభ్యర్థులను సెలక్ట్‌ చేసి ప్రొవిజనల్‌ లిస్ట్‌ను ప్రకటించింది. దీన్ని సవాలు చేస్తూ ఫైనల్‌ లిస్టుకు సెలక్ట్‌ కానీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు టీఎస్‌పీఎస్సీ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టరాదని హైకోర్టు తెలిపింది. కాగా, తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

 

Telangana HC stays Group-2 provisional list

The Telangana High Court on Wednesday stayed Group II provisional list and directed the TSPSC not to hold any recruitment until the final verdict.

 

Comments

Facebook Comments