షిరిడీ ట్రస్ట్ సంచలన నిర్ణయం.. సాయిబాబా ఆలయం నిరవధికంగా మూసివేత!

shiridi sai baba temple closed jan 19shiridi sai baba temple closed jan 19

 

షిరిడీ ట్రస్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బాబా జన్మస్థలం పత్రి అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే ప్రకటించడం.. ఆ ప్రాంతాన్ని సాయి జన్మస్థలంగా అభివృద్ధి చేయాలని, దీని కోసం రూ.100 కోట్లు కేటాయిస్తామన్నారు.

 

why Shirdi Sai Baba Temple is Closed

 

సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నిర్ణయంపై షిరిడీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రిని అభివృద్ధి చేస్తే షిర్డీ ప్రాముఖ్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

 

 

ప్రభుత్వం షిరిడీని కాదని పర్భణీకి సాయి మందిరాన్ని తరలించాలని కుట్ర చేస్తోందని ట్రస్ట్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆలయాన్ని మూసివేయాలని ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది.

 

Shirdi to be Closed Indefinitely From January 19

 

తదుపరి కార్యాచరణపై చర్చించడానికి శనివారం సాయంత్రం షిరిడీ గ్రామస్థులంతా సమావేశంకానున్నట్లు ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి థాక్రే పర్భణీ జిల్లాలో అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంలోనే ‘పత్రి’ని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనికి వ్యతిరేకిస్తూనే ట్రస్ట్ ఆలయం మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.

 

దీనిపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదు .. ఇదిలాఉండగా షిరిడీకి వెళ్లేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్న భక్తులు గందరగోళంలో ఉన్నారు. వెళ్లాలా వద్దా అనే సందిగ్థంలో ఉన్నారు.

Shirdi to Remain Shut for Indefinite Period from Sunday

The temple town of Shirdi will be shut for an indefinite period from Sunday. The decision was taken by the administrative body of Sai Baba’s Samadhi to protest against chief minister Uddhav Thackeray’s announcement to allot Rs 100 crore for development of Pathri in Parbhani, which is believed to be Sai Baba’s birthplace.

“We have announced to close Shirdi against rumours from January 19. A meeting of villagers will be convened Saturday evening to discuss the issue. Devotees will not face any difficulty if they come to Shirdi,” B Wakchaure of Saibaba Sansthan Trust was quoted as saying by news age

Comments

Facebook Comments