రోహిత్‌ శర్మ పేరుతో హైదరాబాద్ శివారుల్లో క్రికెట్‌ స్టేడియం.

Rohit Sharma International cricket stadium in Hyderabad

టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలి ఆటతో జట్టుకు అద్భుత విజయాలు అందించిన బ్యాట్స్‌మెన్‌లో ఒకరు. తాజాగా రోహిత్ శర్మకు ప్రత్యేక గుర్తింపు లభించింది. అతడి పేరుతో హైదరాబాద్ శివారుల్లో ఓ క్రికెట్ స్టేడియం నిర్మితం కానుంది.

 

Rohit Sharma International cricket stadium in Hyderabad

 

భారత స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ పేరుతో హైదరాబాద్‌ శివార్లలో క్రికెట్‌ స్టేడియం నిర్మితం కానుంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామ పంచాయతీలోని శ్రీ రామచంద్ర మిషన్‌ ఆశ్రమంలో ఈ స్టేడియానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు.

Rohit Sharma Cricket stadium in Hyderabad Location 

 

 

 

ఇందులో ట్రైనింగ్ సెంటర్ కూడా నిర్వహిస్తారు. ప్రముఖ ఆద్యాత్మిక గురువు కమలేశ్ పటేల్ (దాజీ) ఆధ్వర్యంలో చేగూరులోని కన్హ శాంతివనంలో జరిగిన కార్యక్రమంలో రోహిత్ తన కుటుంబంతో కలిసి పాల్గొన్నాడు

Rohit Sharma lays foundation stone for International cricket stadium in Hyderabad

ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మ, అతడి భార్య రితిక ప్రత్యేక అతిధులుగా విచ్చేశారు.

 

 

‘రోహిత్ శర్మ యువతకు స్ఫూర్తిదాయకమని, అందుకే స్టేడియంకు అతడి పేరు పెట్టామని’ శ్రీరామచంద్ర మిషన్ అధికారి కమలేష్ పటేల్ అన్నారు. అటు రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఇక్కడికి రావడం తనకు సంతోషాన్ని కలిగించిందని, రామచంద్ర మిషన్‌కు తన తోటి క్రికెటర్లను తీసుకురావాలని ఉందని చెప్పారు.

Comments

Facebook Comments