ప్రంజల్‌ పాటిల్‌: దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్‌ -IAS Pranjal Patil Inspiring Story

ప్రంజల్‌ పాటిల్‌: దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్‌

 

జీవితంలో ఏదైనా సాధించాలంటే అంగవైకల్యం ఒక అడ్డు కానే కాదని ఎంతోమంది నిరూపించారు. తమ అంగవైకల్యాన్ని లెక్కచేయుండ తమలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి తన అంధత్వాన్ని కూడా జయించి ఏకంగా సబ్ కలెక్టర్ అయ్యింది. ఆమె పేరే ప్రంజల్ పాటిల్. దేశంలో మొట్టమొదటి అంధ ఐఏఎస్ అధికారిగా రికార్డు సృష్టించింది.

 

The inspiring story of Pranjal Patil: India’s first visually-impaired woman IAS officer

 

మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్‌కు చెందిన ప్రంజల్ పాటిల్ ఆరేళ్ల వయసులోనే చూపు కోల్పోయారు. అయినా సరే పట్టుదల కోల్పోకుండా తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువును కొనసాగించింది. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ నుంచి డిగ్రీపట్టా పొందారు.

చిన్నతనంలో తనకు చూపు పోయిన తర్వాత తన కంటికి ఎన్నో సార్లు సర్జరీలు జరిగాయని.ఎన్ని సర్జరీలు జరిగినా అన్నీ విఫలమయ్యాయని చెప్పారు. ఆ సమయంలో ఎంతో బాధను అనుభవించానన్నారు . అయినా సరే జీవితంలో ఏనాడు వెనుకడుగు వేయలేదని.. ఏదో ఒకటి సాధించాలనే తపనే తనను ఇవ్వాళ ఈ స్థితికి చేర్చిందని ప్రంజల్ పాటిల్ గర్వంగా చెప్పారు.

 

Pranjal Patil IAS Journy

ప్రంజల్ పాటిల్ ఐఏఎస్‌ జర్నీ

 

2016లో జరిగిన యూపీఎస్‌సీ పరీక్షలు రాసి, 773వ ర్యాంక్‌ సాధించారు. దీంతో ఆమెకు భారత రైల్వే అకౌంట్స్‌ సర్వీస్‌ (ఐఆర్‌ఏఎస్‌)లో ఉద్యోగం వచ్చింది. కానీ, ఆమె అంధురాలని తెలియడంతో ఉద్యోగం ఇవ్వడానికి తిరస్కరించారు.

 

అయినాసరే పట్టు వదలని ప్రంజల్‌ తర్వాతి ఏడు జరిగిన యూపీఎస్సీ (UPSC Exam) పరీక్షలు మళ్లీ రాసి 124వ ర్యాంక్‌ సాధించారు. ఈ సారి ఆమె ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ఏడాది శిక్షణలో భాగంగా ఎర్నాకులం అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఆమె తిరువనంతపురం సబ్‌కలెక్టర్‌గా, రెవెన్యూ డివిజినల్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

 

 

 

 

Read the inspiring story of Pranjal Patil: India’s first visually-impaired woman IAS officer

 

ఈ సందర్భంగా తన అనుభవాన్ని ఆమె మీడియాతో షేర్ చేసుకుంటూ ‘ఓడిపోవడానికి అవకాశం ఇవ్వకండి. ప్రయత్నాన్ని విరమించకండి. మనం చేసే కృషే మనకు కావాల్సింది సాధించి పెడుతుంది” అంటూ దేశంలోనే మొదటి అంధ మహిళా ఐఏఎస్‌గా నియమితురాలైన ప్రంజల్‌ పాటిల్‌ (30) పిలుపునిచ్చారు.

 

 

 

 

 

అంధురాలైన తొలి ఐఏఎస్ ఆఫీసర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రంజల్ పాటిల్. కళ్లున్న వారికి సైతం సవాలు విసురుతూ ఐఏఎస్ ఆఫీసరై ఎంతో మంది యువతకు inspiration అయ్యింది.

 

దేశంలో మొట్టమొదటి మహిళా అంధ ఐఏఎస్‌గా ప్రంజల్ రికార్డు సృష్టించగా.. మొట్టమొదటి అంధ ఐఏఎస్ అధికారిగా మధ్యప్రదేశ్‌కు చెందిన కృష్ణ గోపాల్ తివారి ఇప్పటికే రికార్డులకెక్కారు.

 

 

India’s First Blind IAS Officer “Pranjal Patil” Story

Pranjal Patil, India’s First Visually Challenged Woman IAS Officer, Takes Charge as Sub-Collector of Thiruvananthapuram.

she was serving as an Assistant Collector in Ernakulam. She lost her vision when she was just six years old.

After securing the 124th rank in the 2017 Civil Services Exams, #PranjalPatil was posted as Assistant Collector in Ernakulam, Kerala, in 2018.

Now she has been appointed as Sub-Collector for Thiruvananthapuram

Comments

Facebook Comments