నిర్భయ దోషులకు త్వరలో ఉరి.?…. జైల్లో ఉరితాళ్ల తయారీ

నిర్భయ దోషులకు త్వరలో ఉరి

దేశ రాజధాని నడిబొడ్డున ఏడేళ్ల క్రితం అమానవీయంగా నిర్భయపై దారుణ అత్యాచారానికి ఒడిగట్టిన ముద్దాయిలను ఏ క్షణమైనా ఉరి తీసేందుకు రంగం సిద్ధమవుతోంది.

2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెరుగైన చికిత్స అందిస్తుండగా ఆమె  కన్నుమూసింది.

Nirbhaya Case: Delhi Gang-rape Convicts to be Hanged?

 

ఆరుగురు ముద్దాయిల్లో ఒకడు బాల నేరస్థుడు కాగా మరో వ్యక్తి రామ్‌సింగ్‌ 2013 మార్చిలో తిహార్‌ కారాగారంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిగిలిన నలుగురు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.

 

nirbhaya convicts to be hanged

 

 

వీరిలో వినయ్‌శర్మ, అక్షయ్‌ ఠాకుర్‌, ముకేష్‌ సింగ్‌- తిహార్‌ జైల్లో ఉన్నారు. ఉరి తీయడానికి వీలుగా నాలుగో వ్యక్తి పవన్‌ గుప్తాని మండోలి కారాగారం నుంచి తిహార్‌కు తరలించారు.

 

చట్టపరంగా ఉన్న అవకాశాలన్నీ అయిపోయాయని, చివరి ప్రయత్నంగా కావాలంటే రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ప్రయత్నించుకోవచ్చని ఈ నలుగురికి ఈ ఏడాది అక్టోబరు 29నే కారాగార వర్గాలు తెలిపాయి.

 

వీరిలో వినయ్‌ ఒక్కడే అర్జీ పెట్టుకోగా దానిని తిరస్కరించాలని దిల్లీ ప్రభుత్వం, కేంద్ర కేబినెట్‌ కూడా ఇటీవలే రాష్ట్రపతికి సిఫార్సు చేశాయి.

దీనిపై హోంశాఖతో సంప్రదించి, రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. తనకు వేసిన మరణదండనను పునఃసమీక్షించాలంటూ సోమవారం అక్షయ్‌ ఠాకుర్‌ తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గతంలో మిగిలిన ముగ్గురు దాఖలు చేసిన ఇలాంటి అర్జీలను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరస్కరించాక 14 రోజులకు వారిని ఉరి తీయనున్నారు. ఈ 14 రోజుల సమయంలో కోర్టు డెత్ వారంట్ జారీ చేయనుంది.

రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ అనంతరం 14 రోజుల సమయాన్ని తగ్గించి త్వరగా ఉరి తీయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నట్లు సమాచారం.

కాగా నిర్భయ కేసులో నిందితుడైన అక్షయ్ ఠాకూర్ సుప్రీంకోర్టులో సోమవారం రివ్యూ పిటిషన్ సమర్పించారు.ఈ కేసులో నిందితులైన వినయ్ కుమార్, ముకేష్ సింగ్, పవన్ గుప్తాలు కూడా గతంలో రివ్యూపిటిషన్ వేసినా సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది.

 

ఉరితాళ్లు తయారు చేసేదీ ఖైదీలే: 

Who makes Hanging ropes

ముద్దాయిలకు ఉరి ఖాయమని దాదాపు తేలిపోవడంతో దానికి అవసరమైన సన్నాహాలు మొదలయ్యాయి. ఉరి తీయడానికి వాడే దృఢమైన 10 తాళ్లను ఈ నెల 14 నాటికి తయారు చేయాల్సిందిగా కారాగార శాఖ నుంచి బిహార్‌లోని బక్సర్‌లో ఉన్న కేంద్ర కారాగారానికి గత వారమే ఆదేశాలు అందాయి.

 

ఉరితాళ్లను తయారు చేయడంలో 1930 నుంచి బక్సర్‌ కారాగారానికి నైపుణ్యం ఉంది. పార్లమెంటుపై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్‌ గురును 2013లో ఉరి తీయడానికి అవసరమైన తాడునూ బక్సర్‌ ఖైదీలే తయారు చేశారు.

 

వీటిని నిర్భయ ముద్దాయిల కోసమే వాడబోతున్నారనేది స్పష్టమవుతోంది. ‘‘ఒక తాడు తయారీకి అయిదారుగురు మనుషులకు మూడు రోజులు పడుతుంది. కొద్దిమేర యంత్రాలను వినియోగించినా, ప్రధానంగా చేతితోనే తయారు చేస్తారు. చివరిసారిగా సరఫరా చేసినప్పుడు ఒక తాడుకు రూ.1725 చొప్పున తీసుకున్నాం.

Nirbhaya Convicts to be Hanged

ఉరికంబం ఎక్కించాక తాడు బిగించే ముందు వేసే ముసుగు పక్కాగా ఉండేందుకు, ముడి ఊడిపోకుండా ఉండేందుకు దానిలో ఉక్కు, ఇత్తడి తీగలు వాడతారు. వాటి ధర ఆధారంగా ఉరితాడు ఖరీదు ఉంటుంది.

ఒక్కో తాడులో దాదాపు 7000 వరకు పోగులు ఉంటాయి’’ అని తిహార్‌ కారాగార పర్యవేక్షకుడు విజయ్‌కుమార్‌ అరోరా తెలిపారు. ఉరితాళ్లు తయారు చేయగల అనుభవం ఉన్నవారు తగినంత మంది అందుబాటులో ఉన్నారని, గడువులోగానే వాటిని సమకూర్చగలమని చెప్పారు. వీటిని ముందుగానే తయారు చేసి పెట్టుకుంటే వాడుకకు పనికిరావని ఆయనొక వార్తాసంస్థకు వివరించారు.

1930 నుంచి బక్సర్‌లోనే..

 

ఉరి తీయడానికి తమిళనాడుకు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ ….

నిర్భయ ముద్దాయిలను ఉరి తీసేందుకు తిహార్‌ కారాగారంలో తలారి అందుబాటులో లేరు. దీంతో ఈ పనిని తాను స్వచ్ఛందంగా నిర్వర్తిస్తానని తమిళనాడుకు చెందిన ఎస్‌.సుభాష్‌ శ్రీనివాసన్‌ అనే హెడ్‌ కానిస్టేబుల్‌ తిహార్‌ కారాగార డైరెక్టర్‌ జనరల్‌కు లేఖ రాశారు. ఉరి తీసినందుకు తనకేమీ చెల్లించాల్సిన పనిలేదని, ఒక్క అవకాశం ఇస్తే చాలని కోరారు.

 

Bihar jail asked to make execution ropes; speculation rife it’s for Nirbhaya convicts

A jail in Buxar district of Bihar, known for its expertise in manufacturing execution ropes, has been directed to keep 10 pieces ready by the end of this week,

Comments

Facebook Comments