చంద్రయాన్‌-2 ఖర్చు ఎంతంటే?

ISRO Chandrayaan-2 Mission Cost

చంద్రయాన్‌-2 ఖర్చు ఎంతంటే?

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చంద్రయాన్-2. దాని కోసం ఇస్రో ఎంత ఖర్చు చేసిందో పార్లమెంట్ లో ప్రభుత్వం వెల్లడించింది.

లోక్‌సభ సమావేశాల్లో భాగంగా చంద్రయాన్‌-ఖర్చు, తయారీ వివరాలు చెప్పాలంటూ ఎదురైన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ సమాధానం ఇచ్చారు.

 

ISRO Chandrayaan-2 ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు పొందింది. చివరి క్షణాల్లో విక్రమ్ లాండర్ సాంకేతిక సమస్యలతో చంద్రునిపై కాలు మోపడంలో  విఫలం అయినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ వెనుక మన శాస్త్రవేత్తల కృషిని యావద్దేశమూ అభినందించింది.

 

చంద్రయాన్‌-2 ఖర్చు ఎంతో చెప్పిన కేంద్ర ప్రభుత్వం

How Much ISRO invested in Chandrayaan-2 Mission

జులై 22న GSLV MK III-M1 వాహక నౌక ద్వారా దీన్ని అంతరిక్షంలోకి పంపింది. చంద్రయాన్‌-2 కక్ష్యను పెంచుకుంటూ పోయి 276 x 1,42,975 కి.మీకు చేర్చారు. ఐదు సార్లు కక్ష్యను పెంచారు. సెప్టెంబరు 7న సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో భాగంగా విక్రమ్‌ ల్యాండరు చంద్రుడి ఉపరితలం వైపుగా దిగడం మొదలైంది. చంద్రుడి ఉపరితలానికి మరో 500 మీటర్ల దూరంలో ఉండగా ల్యాండరులో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ఇస్రో ఛైర్మన్‌ కె. శివన్‌ ప్రకటించారు.

చంద్రునిపై 500 మీటర్ల ఎత్తు నుంచి గట్టిగా ల్యాండింగ్ అవడంతో ఈ పరిస్థితి ఎదురైందని, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ISRO Chandrayaan-2 Mission Cost

ప్రయోగం విఫలం అయినా కూడా ఇస్రో శ్రమను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని అన్నారు జితేంద్ర సింగ్. మన దేశ ఔన్నత్యాన్ని పెంచే విధంగా శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారని ప్రశంసించారు. ఈ ప్రాజెక్టు మొత్తానికి రూ.978కోట్లు ఖర్చయినట్లుగా జితేంద్ర సింగ్‌ వివరించారు.

Comments

Facebook Comments