GHMC ఆధ్వర్యంలో స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్స్‌|| ఇక పై హైదరాబాద్‌లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వేడి వేడి స్ట్రీట్‌ ఫుడ్‌

ghmc night street food hub gachibowli hitechcity

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్స్‌ ఇక పై హైదరాబాద్‌లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వేడి వేడి స్ట్రీట్‌ ఫుడ్‌

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్స్‌

హైదరాబాద్‌లో రోడ్డు పక్కనే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కొత్తగా స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్స్‌ రాబోతున్నాయి. వీటిలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వేడి వేడి స్ట్రీట్‌ ఫుడ్‌ లభించబోతోంది.

ఇందుకోసం వంట వారికి నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నారు. వీరంతా బల్దియా ఆహార విభాగం పర్యవేక్షణలో ఆరోగ్యకర ప్రమాణాలతో ఆహారాన్ని తయారు చేసి అందించాల్సి ఉంటుంది.

 

GHMC mid night STREET FOOD HUB GACHIBOWLI

 

 

GHMC STREET FOOD HUBS

 

హైదరాబాద్‌లో చాలా హోటళ్లు రాత్రి 11 గంటల వరకు మూతపడతాయి. హైటెక్‌ సిటీ సహా అనేక ప్రాంతాల్లో ఉద్యోగులు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేవారు, రాత్రి పూట విధులు నిర్వహించే వారిని దృష్టిలో ఉంచుకుని వీధి పక్కనే వాహనాల్లో అల్పాహారం తయారు చేసే ఫుడ్ కోర్ట్స్ చాలా పెరిగాయి.

ఈ దుకాణాల్లో నాణ్యత ప్రమాణాలు ఎంత మేరకు ఉంటాయన్నది ప్రశ్నార్థకమేనని అధికారులు అంటున్నారు.
ఇటీవల గచ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లో రోడ్డు పక్కన ఆహారం తిన్న అనేకమంది అస్వస్థతకు గురయ్యారు. నిల్వ ఉన్న పదార్థాలతో వండి వార్చడమే దీనికి కారణమని అధికారులు తేల్చారు

 

GHMC to launch street food hubs in Gachibowli, Hitech city

 

ఈ స్థితిలోనే జీహెచ్‌ఎంసీ శేరిలింగపల్లి జోన్‌ అదనపు కమిషనర్‌ దాసరి హరిచందన నేతృత్వంలో అధికారులు సరికొత్తగా స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్స్‌ ప్రారంభించాలని నిర్ణయించారు .

హైటెక్‌ సిటీ దగ్గర్లోని శిల్పారామం ఎదురుగా అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్‌ రోడ్డులో సరికొత్తగా వీధి వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అండర్‌పాస్‌ పై భాగంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Late Night Food Courts in Hyderabad

70 మంది చిరు వ్యాపారులకు అధికారులు ఆహారం తయారీలో శిక్షణ ఇస్తున్నారు. నెల రోజుల శిక్షణ తరువాత వారికి పరీక్ష పెట్టి సర్టిఫికెట్లు ఇవ్వబోతున్నారు. వీరందరికీ చేతి గ్లౌజుల వంటి సామగ్రి ఇస్తారు.

వెండింగ్‌ మిషన్లతో కూడిన దుకాణం (డబ్బా) బల్దియా అధికారులే ప్రత్యేకంగా తయారు చేసి సమకూరుస్తున్నారు. వినియోగదారులు కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

బల్దియా ఆహార నియంత్రణాధికారి నేతృత్యంలో ఈ మొత్తం పనులన్నీ జరుగుతాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్న స్ట్రీట్‌ వెండింగ్‌ సొసైటీ కింద అంతా పని చేస్తారు.

Comments

Facebook Comments