చంద్రయాన్‌-3, గగన్‌యాన్ ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి

isro chandrayaan 3 gaganyaan mission

 

చంద్రయాన్‌-3 ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చైర్మన్ కే.శివన్ తెలిపారు.

చంద్రయాన్‌-3 ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి

 

ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 అనుకున్న ఫలితం ఇవ్వకపోవడంతో చంద్రయాన్ 3 ప్రయోగానికి ఇస్రో రెడీ అవుతోంది. 2020 సంవత్సరంలో ఈ భారీ ప్రయోగానికి సిద్ధమయ్యామని, అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపిందని ఇస్రో చీఫ్ శివన్ తెలిపారు.

 

శివన్‌ మీడియాతో మాట్లాడుతూ..చంద్రయాన్‌-2 ప్రయోగానికి రూ. 250కోట్లు ఖర్చు కావచ్చని తెలిపారు. చంద్రయాన్-3 కూడా విజయవంతం అవుతుందని తెలిపారు.

చంద్రయాన్-3లో ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్ రోవర్ ఉంటాయని అన్నారు. చంద్రయాన్‌-2 (Chandrayan-3) ప్రయోగంతో సైన్స్‌ డేటాను ఉత్పత్తి చేయడానికి 7 సంవత్సరాలు పనిచేస్తుందని తెలిపారు.

 గగన్‌యాన్ ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి

 

2019లో ఇస్రో విజయాలను శివన్ ప్రస్తావిస్తూ.. కొత్త సంవత్సరంలో ఇస్రో ప్రణాళికలను మీడియాకు తెలియజేశారు. 2020లో చంద్రయాన్-3, గగన్‌యాన్ (Gaganyaan) ప్రయోగాల విజయవంవతం అవ్వడానికి కృషి చేస్తామన్నారు. గగన్‌యాన్ ప్రయోగం దిశగా 2019లో మంచి పురోగతి సాధించాం. అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు భారత్ తొలిసారిగా చేపడుతున్న ప్రయోగం కోసం.. నలుగురు వ్యోమగాములను గుర్తించామని, వీరికి త్వరలోనే శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని శివన్ తెలిపారు.

 

 

2020లో చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని ప్రారంభస్తారని.. చంద్రయాన్‌-2 కంటే చంద్రయాన్‌-3 చాలా తక్కువ ఖర్చవుతుందని అభిప్రాయపడ్డారు.

 

Comments

Facebook Comments