భారతదేశ తొలి మహా దళాధిపతి (నావికా,సైనిక, వైమానిక) గా బిపిన్ రావత్…

Chief of Defence Staff Army Chief General Bipin Rawat

 

సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ భారత తొలి రక్షణదళాల అధిపతిగా (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్-సీడీఎస్) నియమితులయ్యారు.

ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది.

 

భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బిపిన్ రావత్…

 

ప్రస్తుతం ఆర్మీ చీఫ్ జనరల్ పదవిలో ఉన్న బిపిన్ రావత్ మూడేళ్ల పదవీకాలం ఈనెల 31తో ముగుస్తుంది. దీంతో బిపిన్ రావత్ స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరానే భారత ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు.

బిపిన్ రావత్ 1978 డిసెంబర్‌లో ఆర్మీలో జాయిన్ అయ్యారు. 2017 జనవరి 1 నుంచి ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఆయన నియామకం ఈనెల 31 నుంచి అమల్లోకి వస్తుంది.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ వయసును 65 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం నిన్న సంచలన నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేసింది. కొత్తగా మార్పులు చేసిన దాని ప్రకారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ 65 సంవత్సరాలు వచ్చే వరకు ఆ పదవిలో కొనసాగవచ్చు.

Chief Of Defence Staff General Bipin Rawat

 

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ త్రివిధ దళాలకు సంబంధించి రక్షణ శాఖ మంత్రికి ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తారు. ట్రైనింగ్, ఆపరేషన్స్, సహకార సేవలు, కమ్యూనికేషన్స్‌, రిపేర్, మెయింటెనెన్స్ అనే పలు రకాల వాటిలో త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడమే ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ విధి.

సైన్యంలోని మూడు విభాగాలకు వేర్వేరుగా అధిపతులు ఉన్నారు. అయితే త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం ముగ్గురిపై ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని 1982 జూన్ 2న అప్పటి జనరల్ కేవీ కృష్ణారావు అభిప్రాయపడ్డారు.

 

 

1999 కార్గిల్ యుద్ధం తర్వాత సైనిక వ్యూహాలపై సమీక్షించేందుకు నియమించిన మంత్రుల కమిటీ.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌ను నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 2001లో ఈ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరింది. అప్పటి నుంచి దాదాపు రెండు దశాబ్దాలుగా సీడీఎస్ పదవి ప్రతిపాదనలకే పరిమితమైంది. దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం అమలు చేసింది.

ఈ నెల 24న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సీడీఎస్ పదవిని ఏర్పాటు చేసింది. సీడీఎస్ అధికారాలు, బాధ్యతలు తదితర అంశాలతో ప్రకటన విడుదల చేసింది. త్రివిధ దళాల్లో నాలుగు నక్షత్రాల హోదా కలిగిన అధికారిని సీడీఎస్‌గా నియమిస్తామని తెలిపింది. ఆ తర్వాత సీడీఎస్ పదవీ విరమణ వయసును 65 ఏండ్లుగా నిర్ధారించింది.

ప్రస్తుతం త్రివిధ దళాధిపతుల పదవీ విరమణ వయసు 62గా ఉన్న నేపథ్యంలో.. సీడీఎస్ మూడేండ్లపాటు కొనసాగనున్నారు. సీడీఎస్‌కు మిగతా త్రివిధ దళాల అధిపతులతో సమానంగా జీతభత్యాలు ఉంటాయి.

నేడు సైన్యాధిపతిగా బాధ్యతలు చేపట్టనున్న నరవాణె

Next Army Chief of India: General Manoj Mukund Naravane

సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె మంగళవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు సైన్యాధిపతిగా పనిచేసిన బిపిన్ రావత్ పదవీవిరమణ చేస్తుండటంతో ఆయన స్థానంలో నరవాణె బాధ్యతలు చేపడుతారు.

Lieutenant General Manoj Mukund Naravane is next Army Chief of India

Comments

Facebook Comments