మార్చి-2020 వరకు ఉచిత వైఫై: రవిశంకర్‌ ప్రసాద్‌

bharatnet internet free wifi

మార్చి-2020 వరకు ఉచిత వైఫై: రవిశంకర్‌ ప్రసాద్‌

భారత్‌నెట్‌ ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాలకూ వచ్చే మార్చి వరకు వైఫై ఉచితంగా అందిస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు.

Bharat net Free Internet by Government of India

 

దేశవ్యాప్తంగా భారత్‌ నెట్‌తో అనుసంధానమైన గ్రామాలకు అందించే వైఫై సేవలకు వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి రుసుము వసూలు చేయబోమని కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బుధవారం తెలిపారు.

‘‘మేం ఇప్పటికే 1.3 లక్షల గ్రామ పంచాయతీలను భారత్‌ నెట్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానించాం. దీనిని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు చేర్చాలనేది మా లక్ష్యం. భారత్‌ నెట్‌తో అనుసంధానమైన అన్ని గ్రామాల్లోనూ ఉచిత వైఫై సేవలకు మార్చి-2020 వరకు ఎలాంటి రుసుము వసూలు చేయబోం’’ అని కేంద్ర మంత్రి చెప్పారు.

 

Bharat net Internet by Government of India

Comments

Facebook Comments