ఒక్క మాట చాలు.. పీఓకే(పాక్ ఆక్రమిత కశ్మీర్ )ను స్వాధీనం చేసుకుంటాం: ఆర్మీ చీఫ్ నరవణే

INDIAN ARMY CHIEF Naravane ON POK

 

ఆర్టికల్ 370ను రద్దుచేసిన కేంద్ర ప్రభుత్వం తదుపరి లక్ష్యం పాక్ ఆక్రమిత కశ్మీరేననే మాట వినబడుతోంది. పీఓకే కూడా భారత్‌లో అంతర్భాగమేనని, పాక్ నుంచి దానిని స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ కూడా ఊపందుకుంది.

పాక్ ఆక్రమిత కాశ్మీ‌ర్‌ (పీవోకే) విషయంలో చేపట్టబోయే ఆపరేషన్లకు సంబంధించి తమ వద్ద వివిధ ప్లాన్లు ఉన్నాయని నూతన ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే తెలిపారు. ఎలాంటి టాస్క్ కైనా ఆర్మీ సర్వసన్నద్ధంగా ఉందని చెప్పారు.

Army chief MM Naravane on Pok

Army Chief on if PoK can be part of India as stated by political leadership: There is a parliamentary resolution that entire J&K is part of India.If Parliament wants it,then,PoK also should belong to us. When we get orders to that effect, we’ll take appropriate action

ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే కార్యాచరణలో భాగంగా ఎలాంటి దాడులనైనా చేసే హక్కు భారత్ కు ఉందని నరవణే ( Army chief

Manoj Mukund Naravane )తెలిపారు. భారత ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టుగా గత నాలుగేళ్ల కాలంలో మన సైన్యం సాహసోపేతమైన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు.

 

పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో తగిన చర్యలు తీసుకోడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ ముకుంద్ నరవణే పాకిస్థాన్‌ను పరోక్షంగా హెచ్చరించారు.

‘Will get back PoK if Parliament wants’: Indian Army chief General MM Naravane

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ మొత్తం భారతదేశంలో భాగమేనని పార్లమెంటరీ తీర్మానం ఉంది.. ఒకవేళ ఆ ప్రాంతం మనదేనని పార్లమెంటు భావించి, తమను ఆదేశిస్తే తగిన విధానంలో ముందుకెళ్తామని నరవణే స్పష్టం చేశారు.

 

 

వాస్తవాధీన రేఖ వద్ద అత్యంత క్రియాశీలంగా ఉన్నామని, రోజువారీగా నిఘా సమాచారం అందుతోందని ఆర్మీ చీఫ్ తెలిపారు.

నియంత్రణ రేఖ వెంబడి అప్రమత్తంగా ఉండటంతో పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ చర్యలను భగ్నం చేస్తున్నామని అన్నారు.

Comments

Facebook Comments